పది రోజులుగా భూభారతి సేవలు బంద్

హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో పది రోజులుగా భూభారతి సేవలు నిలిచిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్లు, పట్టా మార్పిడి, నాలా కన్వర్షన్, మార్టిగేజ్ పనులు జరగక కొనుగోలుదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్నా కార్యాలయానికి వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోయారు. ఆపరేటర్ సెలవులో ఉండటంతో సమస్య తలెత్తిందని తహసీల్దార్ సురేశ్ కుమార్ తెలిపారు.


