← Back to news

కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

By Aravind· 2h ago
కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

మక్తల్ మండలం మంథన్ గోడ్ సబ్ స్టేషన్ పరిధిలోని మంథన్ గోడ్, ఎర్నగన్ పల్లి, కాట్రేవ్ పల్లి రైతులు కరెంట్ కోతలను నిరసిస్తూ ధర్నా చేస్తున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న కష్టకాలంలో కరెంట్ కోతల వల్ల పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. AE వచ్చి సమస్యను పరిష్కరించే వరకు వెళ్ళేది లేదని సబ్ స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పారు.

More in Local