దాచేపల్లిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో మండల పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల ప్రవర్తన, కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవించాలని సీఐ సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గొడవలు, వివాదాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువతను చెడు మార్గాల్లోకి తీసుకెళ్లే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


