← Back to news

కుమారుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి

By Ramesh Ch· 25 Aug 2026
కుమారుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి

TG: భూములు సాగు చేసుకుంటున్నా.. తన బాగోగులు పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రాజమ్మ తన పెద్ద కుమారుడు బాబుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్న కుమారుడితో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. తనకు 3.15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 36 గుంటల భూమి ఉందని, వాటిని పెద్ద కుమారుడు సాగు చేసుకుంటున్నాడని తెలిపారు. తనను పట్టించుకోవడం లేదని, కుమారుడు, కోడలు తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

More in Local