← Back to news

సుంకేసులలో తగ్గిన నీరు.. రైతుల్లో టెన్షన్

By Repalle Rajesh· 1h ago· Rajoli, Rajoli, Jogulamba Gadwal
సుంకేసులలో తగ్గిన నీరు.. రైతుల్లో టెన్షన్

TG: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందకపోవడంతో వరి, పత్తి, ఉల్లి ఖరీఫ్‌ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సకాలంలో నీరు అందకపోతే దిగుబడులు తగ్గి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలగకుండా కర్ణాటక నుంచి సుంకేసుల బ్యారేజీకి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులను రైతులు కోరారు.

More in Local