'ప్రజావాణి అర్జీలపై వెంటనే యాక్షన్`

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఫీల్డ్ లెవెల్‌లో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి జరిగింది. అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఆయన 94 ఫిర్యాదులు తీసుకున్నారు. వీటిలో రెవెన్యూకు సంబంధించినవే ఎక్కువ — 55 అర్జీలున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్, జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.




