వర్షాలు తగ్గాయి.. ఎండలు పెరిగాయి

AP: నార్త్-సెంట్రల్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ముగిసినట్లు IMD ప్రకటించింది. రాజస్థాన్ లో ఏర్పడిన హై ప్రెజర్, డ్రై వెదర్ కారణంగా ఈ మార్పు చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కర్నూలులో గరిష్ఠంగా 37°C ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

