జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

జడ్చర్ల సమీపంలోని ఫతేపూర్ మైసమ్మ గేటు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి కాల్ చేసి, ట్రీట్మెంట్ కోసం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.



