పంట నష్టం.. సీపీఎం నేతల పరిశీలన!
నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం బొమ్మన్పాడు శివారులో వర్షాభావంతో పంటలు నష్టపోయాయి. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బందమీది బలరామ్, నాయకులు అంతన్గారి బలరాం పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెంకటేష్, కనకప్ప, రాములు, జనార్ధన్, రైతులు ఒగ్గు బాలప్ప, బసవరాజ్, బర్లా నాగప్ప, దానగాళ్ల నాగప్ప, నరసింహ, ఆనందు పాల్గొన్నారు.


