← Back to news

ఎండిన పత్తి.. ఎకరాకు ₹25వేల పరిహారం డిమాండ్!

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 7h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
ఎండిన పత్తి.. ఎకరాకు ₹25వేల పరిహారం డిమాండ్!

ఎల్నినో షాక్.. పత్తి రైతులకు భారీ నష్టం! నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లిలో ఎండిపోయిన పత్తి పంటలను సీపీఎం నాయకులు బుధవారం పరిశీలించారు. వర్షాలు లేక దిగుబడి పడిపోయింది. ఎకరాకు ₹30 వేల నుంచి ₹35 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు.. ₹25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల కార్యదర్శి ఎస్. మల్లేష్ మాట్లాడుతూ.. ఈ నెల 25న అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

More in Local