లిఫ్ట్ కోసం వదిలిన గుంతలో పడి పెయింటర్ మృతి

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ కోసం వదిలిన గుంతలో జారి పడి పెయింటర్ మృతి చెందాడు. మృతుడు చింతలపూడి వెంకటేశ్వరరావు (55)గా పోలీసులు గుర్తించారు. సుమారు 30 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిలో ఉన్న ఆయన, కుమారుడితో కలిసి రాజధాని బ్యాంక్ పెంట్‌హౌస్‌లో పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



