← Back to news

సురేఖను బర్తరఫ్ చేయడం కరెక్ట్ కాదు: డీకే అరుణ

By Mahesh· 2h ago· TG

TG: బీజేపీ MP డీ.కే అరుణ.. కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై రియాక్ట్ అయ్యారు. సురేఖను తొలగించడం బాధాకరమని అన్నారు. కూతురు ఏదో మాట్లాడితే సురేఖపై యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. 2009లో YS రాజశేఖర్ రెడ్డి CMగా ఉన్న టైమ్‌లో సురేఖతో కలిసి తాను కూడా పనిచేశానని చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎదిగిన బీసీ మహిళా నాయకురాలిని ఇలా బర్తరఫ్ చేయడం సరికాదని డీ.కే అరుణ మీడియాతో అన్నారు.

More in TG