WAPL లో అమరావతి మాస్ విక్టరీ

మంగళగిరిలో జరిగిన WAPL మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్‌పై అమరావతి ఈ ఛాంపియన్స్ 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమరావతి టీమ్ 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రంగా లక్ష్మి (50), అనూష (46) రాణించగా, దీక్ష 22 బంతుల్లో 48 రన్స్ కొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. టార్గెట్ ఛేజింగ్‌లో రాయలసీమ 156/9 రన్స్‌కే పరిమితమైంది. సాయి పూజిత 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించింది.



