అంబేద్కర్ కుటుంబంపై తప్పుడు పోస్ట్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్పై ఫేస్బుక్లో తప్పుడు సమాచారంతో పోస్ట్ చేశాడని టీ. విజయ్ కృష్ణపై నారాయణపేట జిల్లా మక్తల్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ తప్పుడు ప్రచారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరగా, పోలీసులు యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.




