ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ 6న నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్‌పీ జాతీయ ప్రతినిధి కళ్లెపెళ్లి ప్రణయ్‌దీప్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులతో కలిసి సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్‌ఎఫ్ బలమైన విద్యార్థి ఉద్యమంగా ఎదిగిందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ, తదితరులు పాల్గొన్నారు.



