← Back to news

పాలిటెక్నిక్‌ల విలీనంపై కొనసాగుతున్న నిరసన

By Bala· 1d ago
పాలిటెక్నిక్‌ల విలీనంపై కొనసాగుతున్న నిరసన

TG: యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల విలీనానికి సంబంధించిన జీవో 97పై విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళన కొనసాగుతోంది. 35 రోజులుగా నిరసనలు చేపడుతూ.. GOను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సాంకేతిక విద్యాశాఖ, SBTET కొనసాగుతాయని, డిప్లొమా కోర్సుల్లో మార్పులు ఉండవని కొన్ని వర్గాలు చెబుతున్నా.. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. క్లారిటీ వచ్చే వరకు విలీనం పూర్తిగా రద్దయిందని చెప్పలేని పరిస్థితి ఉంది.

More in TG