ఎన్నికలు జరగని 58 పంచాయతీలకు 33.62 కోట్లు

TG: కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఎన్నికలు జరగని తెలంగాణలోని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 33.62 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బు ఇచ్చింది. ఇప్పటికే నిధులు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. ఎన్నికలు జరగకపోవడం పంచాయతీల తప్పు కాదని మంత్రి సీతక్క తెలిపారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వాలని కోరారు.


