మోటకొండూరు ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు ప్రెస్ క్లబ్ ఆఫీసులో మొదటి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో అధ్యక్షుడు చామల మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్ ఉస్మాన్, సభ్యులు పాల్గొన్నారు.



