← Back to news

విద్యుత్‌ కోతలతో రైతుల ఇబ్బందులు: జీవన్‌రెడ్డి

By naveed mohd· 1d ago
విద్యుత్‌ కోతలతో రైతుల ఇబ్బందులు: జీవన్‌రెడ్డి

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌, డొంకేశ్వర్‌ ఉమ్మడి మండలాల బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలు, అవినీతి, అక్రమాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించామని, ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.