సంతలో సరుకుల అమ్ముతున్న మద్యం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని SLV వైన్స్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రతి మద్యం సీసాపై అదనంగా ₹.50 వసూలు చేస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అమ్మకాలు, అదనపు వసూళ్లపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.




