ఆ సినిమాని కొట్టింది లేదు!

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై చాలా సినిమాలున్నాయి. కానీ వాటన్నింటిలోకీ అద్భుతమైనది మన తెలుగు సినిమా "ఆదిత్య 369". ప్రేక్షకుల్ని తనతో టైమ్ ట్రావెల్ చేయించారు ఆ సినిమా డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్‌ని మిక్స్ చేసి.. సిల్వర్ స్క్రీన్‌పై సైన్స్ ఫిక్షన్ చందమామ కథను చూపించడం ఆయనకే చెల్లింది. 1991లో రిలీజ్ అయిన ఈ మూవీలో బాలకృష్ణ నటనతోపాటూ, ఆ రోజుల్లోనే మెస్మరైజింగ్ విజువల్ ఎఫెక్ట్స్ రాబట్టడం సింగీతానికే చెల్లింది. ఆయన మరణంతో ఈ ఎవర్ గ్రీన్ సినిమాను అందరూ గుర్తుచేసుకుంటున్నారు.



