← Back to news

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు

By KUCHIPUDI BUJJIBABU· 13h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కొనసాగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పవిత్రోత్సవాలకు కైంకర్యపరులుగా విభు స్వీట్ షాప్ అండ్ బేకరీ నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

More in Local