← Back to news

హైకోర్టుకు YCP?

By Krishna· 1d ago· X

నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ వెయ్యాలనుకుంటోంది YCP. దీనికి కారణం అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో జరిగిన ఘటన. MP మిథున్‌రెడ్డితో కలిసి, నామినేషన్ వేసేందుకు వచ్చిన YCP నేతలు, కార్యకర్తలపై TDP క్యాడర్ రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. YCP క్యాడర్ కూడా బలంగా ప్రతిఘటించింది. రెండువైపులా కొందరికి గాయాలయ్యాయి, YCP వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. SP ధీరజ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

More in AP