దసరాకి రావణుడితో పాటు బొద్దింక దహనం!

ఢిల్లీ రాంలీలా మైదానంలో దసరా వేడుకల్లో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సమాజంలోని అపరిశుభ్రతను అంతం చేయడానికే ఈ బొద్దింక బొమ్మను తగలబెడుతున్నామని, దీని వెనుక ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదని రాంలీలా కమిటీ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే, ఇటీవల CJP ప్రొటెస్ట్ల నేపథ్యంలో ఈ వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.



