← Back to news

దళిత కాలనీల్లో చీకట్లు.. పట్టించుకోని అధికారులు

By DK· 15h ago
దళిత కాలనీల్లో చీకట్లు.. పట్టించుకోని అధికారులు

కర్నూలు జిల్లా నందికోట్కూరు మండలం వడ్డెమాన్ గ్రామంలోని దళిత కాలనీల్లో నాలుగు నెలలుగా వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, బీసీ కాలనీలతో పాటు ప్రధాన వీధుల్లోని విద్యుత్ స్తంభాలకు దీపాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, మహిళలు, వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. చీకటి కారణంగా రోడ్లపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు కనిపించక ప్రమాదాల ముప్పు ఉందన్నారు.

More in Local