← Back to news

అలాంటి పాత్రలు చేయాలనుంది

By A.Ajay· 8 Oct 2026
అలాంటి పాత్రలు చేయాలనుంది

నటి దిశా పటాని ఇకపై గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన, బలమైన పాత్రలు చేయాలనుంది అని చెప్పారు. ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తొలి రోజుల్లో సినిమా సెట్స్‌, పాత్రను అర్థం చేసుకోవడం, కెమెరా ముందు నటించడం వంటి విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఇకపై సైకాలజికల్ డ్రామాలు, థ్రిల్లర్లు, యాక్షన్‌ సినిమాల్లో సవాలుగా ఉండే పాత్రలు చేయాలని ఉందన్నారు.

More in Entertainment