గుజరాత్ యూనివర్సీటీ సిలబస్ లో మోదీతత్వ..

బీజేపీ హయాంలో విద్య కాషాయీకరణే మాత్రమే కాదు వ్యక్తి పూజ కూడా మొదలైంది. గుజరాత్ లో ని బరోడా యూనివర్సిటీలో బీఏ, ఎంఏలోని సోషియాలజీ సబ్జెక్టులో మోదీ తత్వ అనే కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మోదీలో నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ఎలా నడిపించారు ? అభివృద్దికి ఏం చేయాలి ? వంటి అంశాలు బోధిస్తారు. మోదీపై పాఠాలేంటి అన్న విమర్శల్ని విద్యాశాఖ అధికారులు తిప్పి కొట్టారు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఇండియన్ పాలిటిక్స్ లో మోదీ చెరగని ముద్ర వేశారని, ఆయన గురించి తెలుసుకోవడం భావితరాలకు అవసరమని సమర్థించుకుంటున్నారు.


