← Back to news

ఉండవల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

By BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur
ఉండవల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

గుంటూరు జిల్లాలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. 22వ వార్షికోత్సవం సందర్భంగా టీడీపీ నేత ఏనుగ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సింగంశెట్టి వెంకటేశ్వరరావు, రంగిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

More in Local