హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
AP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరవింద హైస్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థినీలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. కృష్ణుడు–గోపికల నృత్యాలు, ముత్యాల కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.



