← Back to news

అనపర్తి ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్‌

By Anaparthi News· 1d ago· East Godavari
అనపర్తి ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్‌

AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్‌ రామగురెడ్డి పదోన్నతిపై రాజమహేంద్రవరం బదిలీ కావడంతో, ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డా. పద్మశ్రీకి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.