ఆళ్ల నాని మృతికి ఎంపీ పుట్టా నివాళి..!

ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి ఏలూరులోని నివాసంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆళ్ల నాని మృతి ఏలూరు జిల్లాకు తీరని లోటని ఎంపీ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




