₹10 కాయిన్స్ తో బైక్ కొనుగోలు.. వీడియో వైరల్
TG:మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన పాస్టర్ రవి జోసెఫ మూడేళ్లుగా సేవింగ్ చేసుకున్న ₹10 కాయిన్స్ తో ₹1.23 లక్షల విలువైన బైక్ కొన్నారు. ఈ రోజు తనకున్న ప్రత్యేక సెంటిమెంట్‌తో నాణేలతోనే బైక్ కొనడానికి షోరూంకు వెళ్లారు. ఆయన తెచ్చిన కాయిన్స్ లెక్కించేందుకు షోరూం సిబ్బందికి సుమారు రెండు గంటల టైం పట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.చిన్న మొత్తాలను కూడా క్రమంగా దాచుకుంటే పెద్ద అవసరాలకు ఉపయోగపడతాయని రవి జోసెఫ్ నిరూపించారు.



