← Back to news

సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

By DK· 18h ago
సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై NCC, NSS విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, ర్యాగింగ్, సైబర్ నేరాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. సమస్యలు ఎదురైతే 15100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.

More in Local