← Back to news

విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు

By Jabeer· 1d ago· నిర్మల్
విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు

ఉత్సవాల భద్రత పేరుతో నిర్మల్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రీఫేస్ కరెంట్ నిలిపివేస్తున్నారు. తీవ్రమైన ఎండల వల్ల నీళ్లు అందక వరి, పత్తి పంటలు ఎండిపోతూ పొలాలు నెర్రెలు బారుతున్నాయి. దీంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పండుగలు ఎంత ముఖ్యమో, తమ బతుకులు కూడా అంతే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే నెల రోజుల పాటు రోజుకు 24 గంటల విద్యుత్ అందించి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More in Local