← Back to news

కార్పొరేషన్‌లో 22 లక్షల రూపాయిల లైట్ల స్కామ్

By Sagar· 2d ago· Peddapalli
కార్పొరేషన్‌లో 22 లక్షల రూపాయిల లైట్ల స్కామ్

బతుకమ్మ పండుగ కోసం 22 లక్షల రూపాయిలు పెట్టి లైట్లు రెంట్ తెచ్చే బదులు, ఆ పైసలతో సొంతంగా కొత్త లైట్లే కొనేయొచ్చని CPM ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య ప్రశ్నించారు. ఇది కాకుండా ఆఫీస్ రిపేర్ల కోసం 20 లక్షలు, కార్పొరేటర్లకు ఫోన్ల కోసం 30 లక్షలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల జేబులు నింపుకోవడానికి ప్రజల డబ్బును వేస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

More in Local