← Back to news

అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: బీఎస్పీ

By Appalanaidu· 1d ago· Pathapaderu, Paderu, Alluri Sitharama Raju
అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: బీఎస్పీ

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అల్లూరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు శెట్టి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం పాడేరులో కలెక్టర్ టి. నిశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్‌లో వర్షాలు లేక రైతులు సాగు చేయలేకపోయారని తెలిపారు. సాగు చేసిన వరి పంటలు కూడా ఎండిపోతున్నాయన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.

More in Local