← Back to news

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు రక్షించుకోండి

By PAKIRAYYA· 1d ago· Vinjamur, Vinjamur, Sri Potti Sriramulu Nellore
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు రక్షించుకోండి

నెల్లూరు జిల్లా దుత్తలూరు సెంటర్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు హెల్మెట్, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కావలి డీఎస్పీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి, కలిగిరి సీఐలు, వివిధ సర్కిల్ల ఎస్ఐలు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులకు, స్థానిక ప్రజలకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవచ్చో అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు రక్షించుకోండి
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు రక్షించుకోండి

More in Local