← Back to news

Breaking: "అక్రమ అరెస్టులు.. CM స్పందించాలి"

By Krishna· 9 Oct 2026

తెలంగాణకు చెందిన CJP సౌత్ జోన్ మెంబర్ స్టాన్లీని మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్‌లో అరెస్ట్ చేసిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలో అక్టోబర్ 10న జరిగే నిరసనలో పాల్గొనేందుకు రైలులో వెళ్తున్న స్టాన్లీ సహా నలుగురు వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది. "వారు ఎక్కడున్నారో పోలీసులు చెప్పట్లేదు. ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే" అని సోషల్ యాక్టివిస్ రుచిత్ ఆశా కమల్ భగ్గుమన్నారు. CM రేవంత్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.

More in TG