మంట రంగు మారితే ముప్పే!

గ్యాస్ స్టవ్‌పై సాధారణంగా నీలం రంగు మంట కనిపించాలి. బర్నర్ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం లేదా గాలి సరిగా అందకపోవడం వల్ల మంట రంగు మారొచ్చు. పసుపు, నారింజ రంగులో మంట తరచూ కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బర్నర్‌ను శుభ్రంగా ఉంచి, వంటగదిలో గాలి ఆడేలా చూసుకోవాలంటున్నారు. మంట రంగు మారుతూ ఉంటే స్టవ్‌ను తనిఖీ చేయించుకోవడం మంచిదంటున్నారు. గ్యాస్ లీకేజీ వస్తుంటే మంట వెలిగించి పరీక్షించకూడదని హెచ్చరిస్తున్నారు.



