← Back to news

"డేటా సెంటర్లు వద్దే.. వద్దు".. రేపు ర్యాలీ

By A.Ajay· 4h ago
"డేటా సెంటర్లు వద్దే.. వద్దు".. రేపు ర్యాలీ

AP: విశాఖపట్నంలో డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు రేపు గ్రీన్ విశాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14న సాయంత్రం 4గంటల 30నిమిషాలకు.. డెయిరీ ఫామ్ జంక్షన్ నుంచి రవీంద్రనగర్ చివరి బస్‌స్టాప్ వరకు ర్యాలీ సాగుతుంది. బస్‌స్టాప్ దగ్గర పర్యావరణ పరిరక్షణపై లఘు నాటిక ప్రదర్శించనున్నారు. ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. డేటా సెంటర్ల వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవాలని సూచించారు.

More in AP