తెలంగాణలో BCలకు రాజ్యాధికారం రావాలి

రాష్ట్రంలో అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయిందని, జనాభాకు తగ్గట్టు BCలు తమ రాజకీయ వాటా కోసం పోరాడాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన BC రాజ్యాధికార పాదయాత్ర షాద్‌నగర్‌కు చేరుకుంది. అక్కడ జరిగిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు.



