← Back to news

వర్షాలు కురిసే వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

By B V Appalanaidu· 17h ago· Ananthagiri, Ananthagiri, Alluri Sitharama Raju
వర్షాలు కురిసే వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి రంగారావు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో నీరు నిల్వకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షం కురుస్తున్న సమయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీని వాయిదా వేయాలని సూచించారు. పంటల్లో తేమ కారణంగా వచ్చే తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.

More in Local