ఓటర్ల జాబితాపై పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, INDIA కూటమి MPల అరెస్టులను ఆయన ఖండించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అర్హుల ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని పిలుపునిచ్చారు.



