అమెజాన్ ఆఫీస్ బయట ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు
ఇవాళ ఉదయం బెంగళూరులోని బాగలూరు క్రాస్ సమీపంలో ఉన్న అమెజాన్ ఆఫీస్ గేట్ నంబర్ 3 బయట ఫుట్‌పాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ బాక్స్ అకస్మాత్తుగా పేలింది. అక్కడ నడుస్తున్న మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు, BESCOM అధికారులు విచారణ చేస్తున్నారు.

