← Back to news

ప్రియాంకా గాంధీని కొట్టిన పోలీసులు

By Sahani· 10h ago· X· Delhi

ఎలక్షన్ కమిషన్ సభ్యులను కలవడానికి వెళ్తున్న MPలపై పోలీసులు దాడి చేశారని ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఆమె <a href="https://www.theclearcutnews.com/n/pW5QbVJ">రోడ్డుపైనే పడుకుని</a> మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా పోలీసులు తనను కొట్టారని, గిల్లారని, రోడ్డుపైకి నెట్టేశారని ఆమె ఆరోపించారు. ఎంత మంది బలగాలను తెచ్చినా సరే, తాను ఇక్కడి నుంచి కదిలేదే లేదని, ప్రొటెస్ట్ కొనసాగిస్తామని ప్రియాంకా గాంధీ తెగేసి చెప్పారు.

More in Current Affairs

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్
Current Affairs· 6h ago

అక్టోబర్‌ 7.. ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’: కాంగ్రెస్

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండి కూటమి ఎంపీలపై <a href="https://www.theclearcutnews.com/n/FSTNmBx">ఢిల్లీ పోలీసులు</a> చేసిన <a href="https://www.theclearcutnews.com/n/6sdrN3m">చర్య</a>ను కాంగ్రెస్ <a href="https://www.theclearcutnews.com/n/JWtPBGU">‘రాజ్యాంగంపై దాడి’</a>గా పేర్కొంది. అక్టోబర్ 7ను భారతీయ ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. రేపు (అక్టోబర్ 8, 2026) రాష్ట్ర, జిల్లా, బ్లాక్/మండల స్థాయిల్లో భారీ నిరసనలు నిర్వహించాలని పార్టీ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కె.సి.వేణుగోపాల్ అన్ని PCC అధ్యక్షులకు లేఖ రాశారు.