ఈనాడు ప్రతిభా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం జిల్లాలోని ఇస్లాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈనాడు ప్రతిభా పోటీల్లో భాగంగా ఎస్సే రైటింగ్ పోటీ జరిగింది. ఎల్ నినో అంశంపై తెలుగులో వ్యాసరచన పోటీలో 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పి. సంజయ్ ప్రథమ, ఆర్. లక్ష్మీ ప్రసన్న ద్వితీయ, ఎల్. అక్షయ్ కుమార్ తృతీయ స్థానం సాధించారు. ప్రధానోపాధ్యాయురాలు జి. ప్రమీల మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థుల సృజనాత్మకత, రచనా నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని ఈనాడు కోఆర్డినేటర్ డేవిడ్ రాజు సమన్వయం చేశారు.





