← Back to news

నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల!

By Appalanaidu· 2h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకర ఎదుగుదల!

నులిపురుగుల నిర్మూలనతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2,116 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయించారు. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మిగిలిన పిల్లలకు అక్టోబర్ 5న మాత్రలు వేస్తామని తెలిపారు.

More in Local