నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ & రేటింగ్

ఇవాళ రిలీజైన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకులకు పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. లీడ్ యాక్టర్ నాని కష్టపడ్డా, కథ బలంగా లేకపోవడంతో సినిమా ఆకట్టుకోవడం లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఫైట్లు, వయలెన్స్ సీన్స్ ఉన్నాయి కానీ, ఎమోషన్ మాత్రం కనెక్ట్ కాలేదు. మోహన్‌బాబు, సంపూర్ణేష్ బాబు లాంటి నటులున్నా వారి పాత్రలకు పెద్దగా బలం లేదు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్‌గా ఉండటంతో డైలాగులు సరిగ్గా వినిపించడం లేదు. కథ చెప్పడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రేటింగ్: 2/5



