లారీ బోల్తా.. 2 కిలోమీటర్లు నిలిచిపోయిన వాహనాలు
మెదక్ జిల్లాలోని వల్లూరు నుంచి నార్సింగ్ జాతీయ రహదారిపై ఒక లారీ రోడ్డు మధ్యలో బోల్తా పడటంతో, సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


