కొందరి వల్ల పార్టీకి చెడు పేరు: అక్బరుద్దీన్ ఒవైసీ

మజ్లిస్(AIMIM) పార్టీపై, పార్టీ నాయకులపై వస్తున్న విమర్శలపై MIM శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్టీకి చెందిన కొందరు నాయకుల వల్ల చెడు పేరు వస్తోందని అన్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, తమ ప్రజలకు కావలసిన పనులు ఎలా చేయించుకోవాలో మజ్లిస్‌కు బాగా తెలుసని స్పష్టం చేశారు. తమ లక్ష్యం పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీల హక్కుల పరిరక్షణ అని తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెంచడానికి ప్రయత్నించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



